పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి, టీడీపీ దీక్షలో కూర్చున్న టైలర్ అసోసియేషన్ నాయకులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. జనసేన నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి ఉన్నందువల్ల, మిగిలిన వారందరినీ కూడా ఏ వన్ ముద్దాయిలుగా చూపించాలని, ఉద్దేశం తప్ప, మరొకటి కాదని తెలియజేశారు. 2024లో జనసేన పార్టీ టిడిపి పార్టీ పొత్తులో భాగంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ టిడిపి పార్టీ ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. మన రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని ప్రజలు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి ఆంధ్ర రాష్ట్రం నుండి వైసీపీ పాలన అంతం చేయడానికి ప్రజలు వెయిట్ చేస్తున్నారన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా, తిరుగులేని ఆదిత్యంతో జనసేన టిడిపి కూటమికి ప్రజల బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. అలాగే టిడిపి ఇన్చార్జ్ శ్యాం కుమార్ గారు మాట్లాడుతూ టిడిపి నాయకులు జనసేన యువకులు, పెద్ద చిన్న అని తేడా లేకుండా, పనిచేద్దాం. అధికారాన్ని స్థాపిద్దామని అన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన పత్తికొండలో మా విజయం ఆపడం ఎవరివల్ల కాదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, కరణం రవి, గల్లా రామచంద్ర, నాయకల్ బాబ్జి, పులి శేఖర్, నూర్ భాషా, గద్దల రాజు, అజయ్, వడ్డే వీరేష్, పెరవిలి భాష, రమేష్, నాగేశ్వరరావు, భాస్కర్, నరేష్, రెడ్డి పొగ నాగరాజ్, సోమరాజు, అనిల్ మరియు తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.