మదనపల్లి ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం ప్రచారం 50 రోజులు దిగ్విజయంగా విజయవంతంగా ముగిసింది. 50 రోజులు ముగిసిన సందర్భంగా స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో 50 రోజుల కేకును కట్ చేసి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలను సాదరంగా ఆలకించి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లి 50 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ మహా యజ్ఞానికి సహకరించిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఇలాగే ముందు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించమని రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకు సుస్థిరమైన పాలన నీతివంతమైన నిజాయితీ పరిపాలన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీర మహిళలు మల్లికా రూప, పద్మావతి, జయమ్మ, ప్రభావతి మరియు దారం హరిప్రసాద్, రఘునాథ్, ఆకుల శంకర, అశ్వత్ రాయల్, కోటకొండ చంద్రశేఖర్, శ్రీనాథ్ పతి, శివా, శీన, గంగాధర్, గోపాల్, సోను, హర్ష యాసిన్, గణేష్ ధరణి శేఖర్ బహదూర్ ముఖేష్ అరవింద్ అబ్దుల్ మజీద్ మహమ్మద్ గౌస్ మరియు పెద్ద సంఖ్యలో వీర మహిళలు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com