మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి నియోజకవర్గం స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ ముందర చేపట్టిన సమ్మెకి జనసేన మద్దతుగా నిలిచింది. న్యాయబద్ధమైన 17 డిమాండ్లను తక్షణమే ప్రభుత్వము అమలు చేయాలని చేస్తున్న సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు, అనిత మాట్లాడుతూ మదనపల్లెలో 1992 ప్రకారం ఉన్న కార్మికులు సంఖ్య నే(250) సాగి స్తున్నారని, పెరిగిన జనాభా పరంగా కార్మికుల సంఖ్య ను పెంచకపోగా170మందికి తగ్గించారని వీళ్ళకి పని భారం ఎక్కువ ఉండటం తగిన వేతనం లేకపోవడం దారుణం అన్నారు. కేవలం 21 వేలు మాత్రమే ఇవ్వడం ఇందులో కూడా 2000 కటింగ్ పోను చాలి చాలని జీతంతో బతకడం దుర్బరంగా వుందన్నారు. కావున పరిశుద్ధ కార్మికుల యొక్క డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి వాటిని అమలు చేసి వారికి తగి న్యాయం చేయాలని అట్ల చేయని పక్షంలో ఈ యొక్క అంశాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టి వరకు తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా జనసేన పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరి ప్రసాద్, మదనపల్లి స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, జనసేన నాయకులు అశ్వత్ మైనారిటీ నాయకులు గణేష్, మదనపల్లి జనసేన మహిళ నాయకురాలు రూప బహదూర్ తదితరులు పాల్గొన్నారు.