నెల్లూరు ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.... జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసింది సొంత ప్రయోజనాలకు కాదు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలని ప్రజల ఇబ్బందుల నుండి కాపాడటానికి, రాష్ట్రంలో అరాచకాలను ఎండగట్టడానికే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయానికి జనసేన నాయకులు,కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుభవజ్నుల అనుభవాన్ని జనసేన పార్టీ యువత తెగింపుని ముందుకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి స్థాపించేందుకు కష్టపడి పనిచేసే కోవూరు లో జరుగుతున్న జరుపుతున్న అరాచకాలు అంతమొందిస్తామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com