Logo
Date of Publish : 02 January 2024, 9:43 pm
Editor : Sake Naresh

బొబ్బిలిలో అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతు

  బొబ్బిలి ( జనస్వరం ) : అంగన్వాడీల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని గత 22 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా జనసేన నిలిచింది. బాబు పాలూరు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మీ అందరి ఓట్లు కోసం నోటికొచ్చిన హామీలిచ్చిన జగన్, ఈ రోజు మాట తప్పి తన మడమ‌ తిప్పి అంగన్వాడీలు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లను గురుంచి కనీసం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో మాట్లాడడానికి కూడా అనుమతించకపోవడమే కాకుండా తన పార్టీ MLA లు అంగన్వాడీల గురుంచి చాలా నీచంగా మాట్లాడుతున్నా వారిని ముఖ్యమంత్రి వారించకపోవడం దారుణమని అన్నారు. మరో 90 రోజుల్లో ఈ మాయదారి ప్రభుత్వం దిగిపోయి, మన జనసేన+తెదేపా ప్రజా ప్రభుత్వం రాబోతుందని, తప్పనిసరిగా మీ కనీస వేతనం మరియు ఇతర డిమాండ్లపై మన ప్రభుత్వం మీ సానుకూలంగా ఉంటుందని భరోసానిచ్చారు. 2018లో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ గారు మన బొబ్బిలికి వచ్చినపుడు మీ అంగన్వాడీ సభ్యులు కొందరు ఆయనను కలిసి జీతాలు గురుంచి మొరపెట్టుకుంటే, తక్షణమే పవన్ కళ్యాణ్ స్పందించి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంతో కేవలం 15 రోజుల్లోనే వేతనాలు పెంచే విధంగా ఒత్తిడి తీసుకురాగలిగారనే విషయాన్ని గుర్తు చేసారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారి హయాంలో మరింత జనరంజక పాలన రాబోతుందని, ధైర్యంగా ఉంటూ మీ ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించండని, అంగన్వాడీలకు మా ఇరు పార్టీల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచనా గంగాధర్ గారు, బొబ్బిలి నాయకులు పళ్లెం రాజా, రేవల్ల కిరణ్ కుమార్, వీర మహిళ రమ్య గారు, జనసేన పార్టీ నాయకులు రాజు, రమేష్, జాన్, హరిచరణ్, అగూర్ శ్రీను, కాత విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com