అనపర్తి, (జనస్వరం) : 2019లో రాష్ట్రం మొత్తం 90 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు భరోసా కల్పించలేదు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల ప్రకారం బాధిత రైతు కుటుంబాలను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుల కందుల దుర్గేష్ నేతృత్వంలో అనపర్తి నియోజకవర్గ జనసేన నాయకులు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం జరిగే వరకూ జనసేనపార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. అదే విధంగా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామంలో ద్వారంపూడి నర్సిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. జనసేన నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారి దగ్గర నుంచి ఆధారాలను ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తీసుకొని జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కి నివేదిక ఇవ్వనున్నారు. అలాగే నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com