Logo
Date of Publish : 01 May 2023, 4:12 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర..

       ఏలూరు ( జనస్వరం ) : ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట లో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలోని 43వ డివిజన్లో పాదయాత్రను నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈరోజు 43 వ డివిజన్ శేఖర్ వీధి ఏరియా లో ఈ పాదయాత్ర ను నిర్వహిస్తున్నామని ఈ డివిజన్లో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.. ఒక మామ్మ గారికి మా పెన్షన్ పీకేసారని మా వద్దకు ఆవేదనా వ్యక్తం చేశారు.. ఏ ఇంటి దగ్గరికి వెళ్లిన దుర్మార్గంగా ఇంటి పనులు వసూలు చేస్తున్నారని ఇవి మోయలేని భారంగా ఉన్నాయని అంటున్నారు.. ఈరోజున ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధిని కోల్పోయామని కరెంట్ బిల్ చూస్తే తీవ్ర స్థాయిలో ఉన్నాయని అన్నారు.. ఇంటి పన్నుల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది.. ఇది కాకుండా అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తున్నారు.. అన్ని రకాల పన్నుల భారాలతో ప్రజల్ని పీడిస్తున్నారు.. ఇది చాలదన్నట్లుగా జగనన్న నువ్వే మా భవిష్యత్తు అనే స్టిక్కర్ మా ఇంటి ముందు బలవంతంగా అతికిస్తున్నారు స్టిక్కర్లను ఎవరైనా పీకితే సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారు.. అన్ని రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేస్తుంది.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు.. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎప్పుడు ఈ జగన్ బాబుని ఇంటికి పంపిస్తామని ఆలోచనతో ప్రజలు ఉన్నారు.. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెంచిన ఆ పన్నులను తక్షణమే రద్దు చేయాలని అదేవిధంగా చెత్త పన్ను ని రద్దు చేయాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం..సామాన్యులు ఉండే పరిస్థితి లేదని అన్నారు.. నిత్యవసర వస్తువులు ఎంత అవసరమో ఈ రోజున కరెంటు కూడా అంతే అవసరం అని ఈ బలహీనతలను తీసుకొని ఈరోజున ఈ ప్రభుత్వం అందర్నీ వంచిస్తూ పీడిస్తూ మాకు నరకాన్ని చూపిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అదేవిధంగా 15% పెంచిన ఇంటి పన్నును రద్దు చేయాలి.. నిత్యవసర ధరలు నియంత్రించాలి.. కరెంటు స్లాబు సిస్టాలను మార్చాలి.. ఇప్పటికైనా ఈ దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడు దఫాలుగా లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల నాని నీ మేము మూడుసార్లు గెలిపించాము.. మాకు పన్నులు పీకేసిన ఎవరు పలకరించే నాధుడు లేరని గెలిచిన ఎమ్మెల్యే ఆ ఆలోచన చేయడం లేదని మూడుసార్లు మూడుసార్లు మేము గెలిపించుకున్న ఈ ఆళ్ళనాన్ని ఏలూరుకి అవసరం లేదని అభివృద్ధి గాని సంక్షేమంగానే అందరికీ అందుబాటులో లేనటువంటి ఈ ఎమ్మెల్యే మాకు అవసరం లేదని ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి..మరి భవిష్యత్తులో పవన్ అన్న రావాలి జగన్ పోవాలి అనే నినాదంతో ఈరోజున ప్రజలు ఉన్నారని ఎదురుచూస్తున్నారని తెలియజేస్తున్నామన్నారు.. ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, అగ్గాల శ్రీనివాస్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, పవన్,1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ స్థానిక డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com