Logo
Date of Publish : 19 March 2022, 3:17 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం : జనసేన నాయకులు గంధం ఆనంద్

   మధిర, (జనస్వరం) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని మధిర నియోజక వర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ అన్నాడు. శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా యవతకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడమే పవన్ కళ్యాణ్ గారి ఆశయమని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా సమస్య ఎక్కడ అయితే ఉంటుందో జనసేన పార్టీ ముందు ఉండి సమస్యలు తీరుస్తాము. అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం బలిదానాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో యువతులకు మిగిలింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వారి ఆశలు నిరాశలుగానే మిగిలింది అని అన్నారు. రెండో సారి జరిగిన ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సమస్యలు రాష్ట్రం పరిష్కారం చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందు అడుగు వేస్తుందని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com