ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలించడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది
కడప జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ తరలించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కూరగాయల మార్కెట్ ద్వారా దాదాపు 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాచమల్లు కూరగాయల మార్కెట్ తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారం వచ్చాక మాట మార్చి కూరగాయల మార్కెట్ తరలిస్తున్నారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే అభివృద్ధి ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ధనదాహానికి పాల్పడుతూ పేద ప్రజల కడుపులు కొడుతున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కూరగాయల మార్కెట్ పై నిర్ణయాన్ని మార్చుకొని పక్షంలో జనసేన పేద ప్రజల పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉంది. అవినీతి రహిత పాలన అని చెప్పే అర్హత వైసీపీ కి లేదు. జిల్లా వ్యాప్తంగా భూ కబ్జాలు మితిమీరి పోతున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నగర అధ్యక్షుడు మాలే శివ, రామ్ సిద్దు ఇతర నాయకులు పాల్గొన్నారు.