పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోకవర్గం గోపాలపురంలో ఇసుక అక్రమ రవాణాను చేస్తుండగా జనసేన, తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ సమన్వయ కర్త నిమ్మల నిబ్రహం, కూరంగి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇదే విధంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని, తెరవెనుక ప్రభుత్వ హస్తం ఉందని, ప్రభుత్వం ఇసుక మాఫియాను పెంచిపోషిస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com