వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధి) గారు చైత పన్నులు ఆపాలని డిమాండ్ చేశారు. 14 నెలలుగా కరోనా తో ఆర్ధికంగా ఇబందులు పడుతున్న ప్రజల పై కొత్తగా చైత పన్నులు మోపడం సబబు కాదని తక్షణమే వాటిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కరంట్ బిల్లులు ఆర్ధికంగా ఇబందులు పడుతున్న ప్రజల కు ఏప్రిల్, మే, జూన్, జులై నెలలు సంబందించిన కరంట్ బిల్లులు రద్దు చేయాలి. 14 నెలలు గా ప్రవేటు స్కూల్స్ యాజమాన్యం అనేక రకాలుగా ఆర్ధికంగా ఇబందులు పడుతూ స్కూల్స్ నడపటం కష్టంగా ఉంది. స్కూల్స్, కాలేజీ లో పనిచేస్తున ప్రవేటు టీచర్స్, లేక్చర్స్ 14 నెలలు గా పని లేక ఆర్ధికంగా ఇబందులు పడుతున్నారు. వారి అందరిని ఆర్ధికంగా ఆడుకోవాలని కోరుచున్నాము. బిల్డింగ్ వర్కర్స్ 2 సంవత్సరాలనుండి ఇసుక లేక సరిగ్గా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికీ వారు కస్టపడి దాచుకున్న P F సుమారు 1500 కోట్లు ఉంది ఆ నిది నుండి వారికీ నెలకు 10, 000 వేలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోచున్నాము. పనికి ఆహారం పధకం కింద రోజువారి కూలీలు వ్యవసాయ కూలీలు అనేక మంది పనులు లేక ఇబందులు పడుతున్న వారికీ పనికి ఆహార పథకం కింద ఎక్కువ రోజులు పని కల్పించాలని కోరుకుంటున్నాము. చైత పన్నులు ఆపాలని బిల్డింగ్ వర్కర్స్ ని రోజు వారి కూలీలను ఆదుకోవాలని జనసేన పార్టీ పవన్ కళ్యణ్ గారి తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.