గడిచిన 2 సంవత్సరాలుగా ఇసుక టన్ను 375 రూపాయలు ఉండటం వలన ఒక ట్రాక్టర్ ఇసుక బ్లాక్ లో 4500 రూపాయలకు కొనవలసిన పరిస్థితి ఏర్పడిందని జనసేన నాయకులు అక్కల రామ మోహన్ రావు గారు అన్నారు. ఇప్పుడు టన్ను 475 రూపాయలుకు పెంచటము వలన ఇసుక రేటు పెరిగి సామాన్యులు కు అధిక భారం అవుతుంది. దీని వలన గ్రామలలో గృహ నిర్మాణం ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు ఇసుక మీద ఆధారపడి అనేక మంది కార్మికులు ఆర్ధికంగా నష్టపోతారు. అలాగే నిర్మాణ రంగం అపార్ట్మెంట్ నిర్మాణం, కాంట్రాక్టు పనులు, బ్రిడ్జి నిర్మాణం పనులు జరగక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇసుక మీద ఆధారపడ్డ ట్రాన్స్ పోర్ట్ లారీలు, ట్రాక్టర్ల్లు, ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్ల్లు, మైకానిక్లు అందరు నస్టపోవటం జరుగుతుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు పెంచిన ఇసుక చార్జీలు తక్షణమే తగ్గించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com