Logo
Date of Publish : 15 August 2023, 8:31 pm
Editor : Sake Naresh

విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల చనిపోయిన ఉద్యోగి నరేంద్ర కుటుంబానికి అండగా జనసేన

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి ఆలయంలో సానిటైజేషన్ లో పని చేసే నరేంద్ర అనే ఉద్యోగి నిన్నటి రోజు విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా చనిపోవడం చాలా బాధాకరం. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వెళ్లి మార్చురీ లోని నరేంద్ర మృత దేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర కుటుంబ సభ్యులు ఆలయ అధికారుల నుండి ఎలాంటి హామీ,బరోసా ఇవ్వలేదని చనిపోవడానికి గల కారణాలు సి.సి టీవీ విడియోలు బయట పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సబ్యులకు జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని, తక్షణమే ఆలయ ఈఓ మరియు చైర్మన్ గారు ఆ కుటుంబానికి నష్ట పరిహారాన్ని 25 లక్షలు అయినా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆలయంలో పెర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలా కాదని కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తే జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉండి పోరాడుతామని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్, వేణు గోపాల్, వెంకట రమణ యాదవ్, గణేష్ , చెంచు ముని, వెంకటేష్ , గురవయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com