– గిరిజనులకు అండగా జనసే :
– అగ్రవర్ణాల్లో పేదలకు అండగా పవన్ కళ్యాణ్:
– అందరికీ సమాన అవకాశాలు తీసుకురావడమే లక్ష్యం:
– జనసేన ఇన్చార్జి మరి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి.
గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, కార్వేటినగరం పంచాయితీలోని చింతోపు, ఐకేంపేట పంచాయతీలోని రాజుల కండ్రికి గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం ( భవిష్యత్తు గ్యారెంటీ ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులను పలకరిస్తూ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గిరిజనులకు సముచితమైన స్థానం ఉంటుందని, వారి పురోభివృద్ధికి జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జనసేన ఎల్లవేళలా అండగా ఉంటుందని, షణ్ముఖ వ్యూహంలో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందడం ఖాయమని తెలియజేశారు. ముఖ్యంగా నిరుద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు సముచితమైన స్థానం ఉంటుందని తెలిపారు. గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందడం ఖాయమని తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని చూశారు, సరికొత్త ప్రజా ప్రభుత్వానికి చేయూతనిచ్చి, పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ నరేష్, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా కార్యక్రమం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ కార్యదర్శి కోదండన్, పాలసముద్రం మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, కార్వేటినగరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు బాల వరదయ్య పాల్గొన్నారు.