కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి చేర్చడానికి జనసేన పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు 172 మంది ప్రవాసాంధ్రులతో కూడిన ప్రత్యేక విమానం దుబాయి నుంచి విశాఖపట్నం కు వచ్చింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ తో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే టికెట్లు ఇవ్వడం జరిగింది. కికెట్ కొనలేని స్థోమత ఉన్నవాళ్లకి ఉచిత టికెట్లు ఇచ్చామని చెప్పారు. “ జనసేన సేవా సమితి, కువైట్ ” సభ్యులు రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, శ్రీకాంత్, ధనుంజయ, శ్రీనివాసులు చొరవ తీసుకొని కువైట్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడంలో వారి సహాకారాన్ని అందించారు. వీరికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com