తెలంగాణలోని రెబ్బవరం గ్రామంలో జనసేనాని జన్మదినోత్సవ సందర్భంగా మాస్కులు పంపిణీ, రక్తదానం చేసిన జనసైనికులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంబారలు ఆకాశాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరంలో జనసేన అధినేత జన్మదిన సందర్భంగా గ్రామంలోని అందరికీ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు జనసైనికులు. అలాగే రక్తదానం కూడా కొంత మంది జనసైనికులు చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ ఇపుడు ప్రపంచం మొత్తం మానవాళి కరోనా మహమ్మారితో అనారోగ్య బారిన పడింది. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంతవరకూ కనగొనలేదు. కావున మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ కరోనా మహమ్మారి మన దరికి చేరకూడదు అంటే మాస్కులు మాత్రమే మనకు ఆయుధం. ఆ కరోనా లాక్ డౌన్ కాలంలో జనసైనికులు చేసిన జనసేవ కార్యక్రమాలు అభినందించదగినవి అన్నారు. గ్రామంలో మాస్కులు ధరించట్లేదని మా దృష్టికి వచ్చింది, అందుకే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో అందరికీ మాస్కులు పంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ట నాగేంద్ర బాబు, గుట్ట నరేష్, గుట్ట హనుమంతు, నరేష్, గోవర్ధన్, హస్లాము, ఇతర జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com