Logo
Date of Publish : 03 October 2022, 4:22 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే జనసేన అధికారంలోకి రావాలి : నలిశెట్టి శ్రీధర్

           ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, ఈరోజు 22వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని, జగన్నాథరావు పేటలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు వెంకట్రావుపల్లి, శాంతి నగరం, నర్సాపురం, జాలయ్య నగరం, ముస్తాపురం,నెల్లూరు పాలెం, పేరారెడ్డి పల్లి, బీ.సీ. కాలనీ, వీవర్స్ కాలనీ, టెంకాయ తోపు, తూర్పు వీధి, జే.ఆర్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రతి ప్రాంతంలో పట్టబగులు వీది దీపాలు వెలుగుతుండడం గమనించాము. ఈ విధంగా జరుగుతున్న అనవసరపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, పవన్, భాను, ఆనంద్, అనిల్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com