
కృష్ణా ( జనస్వరం ) : జనసేన పార్టీ శ్రేణులంతా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ జనసేన పార్టీ ని ముందుకు మండలంలోని గ్రామగ్రామాన పతిష్టవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. మండలంలోని వాడవల్లి గ్రామ కార్యకర్తలతో సమావేశం జరిపారు. సమావేశంలో మండలంలో నెలకొన్న అనేక సమస్యలపై చర్చాంచి, కొత్తపల్లి – నడిపూరు రహదారిని తక్షణమే మరమ్మత్తులు చేయాలి కోరారు. అలానే పార్టీ సిద్ధాంతాలని , జనసేనాని ఆసేయల సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, నియోజకవర్గ నాయకులు దూసనపుది బ్రహ్మాజీ, మోటేపల్లి హనుమ ప్రసాద్, కూనపరెడ్డి రాజా, మండల నాయకులు నంది దిలీప్, కొనబత్తుల అయ్యప్ప, మాట్లాపుది సంతోష్, బొర్రా గుణ, జొన్నల నరేష్, బోయిన సాయి, బోయిన వాసు, ఎర్రంశెట్టి పూర్ణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.