Search
Close this search box.
Search
Close this search box.

జనసేన షణ్ముఖ వ్యూహం – భవిష్యత్తుకి భరోసా

జనసేన

                    2022లో జరిగిన ఆవిర్భావ సభకి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ, 2019 రాజమండ్రి లో జరిగిన ఆవిర్భావ సభకి వెళ్లే అదృష్టం దక్కింది. ఆ రోజు మేనిఫెస్టోని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక వాక్యం ఇంకా కదులుతోంది. “Entire manifesto, we are declaring a war on unemployment”. మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అని చెప్పటం జరిగింది. 2024 ఎన్నికలకి వెళ్ళబోతూ కూడా ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగం మీద చేస్తున్న యుద్దాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. 2014 నుండి కూడా నా ఆలోచన ఒకటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక ఎన్నిక రాష్ట్ర సమస్య మీద జరిగిన కూడా కనీసం తర్వాత ఎన్నికలైనా, జిల్లా స్థాయి సమస్యలమీద జరగాలి. అంటే రాష్ట్ర స్థాయి సమస్యలు పరిష్కరించగలగాలి. కానీ చూస్కుంటే ఈ టీడీపీ, వైసీపీ ఉన్నన్ని రోజులు మనం రాష్ట్ర స్థాయి సమస్యల మీద మాత్రమే యుద్ధం చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. టీడీపీ హయాంలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయో మా హయంలో కూడా అన్నే జరిగాయి అని చెప్పి వాళ్ళకి మాకు తేడా లేదు. మేము వచ్చాక రాష్టాన్ని ముందుకు తీస్కెళ్ళలేదు అని చెప్పుకుంటున్న మంత్రులకి ధన్యవాదములు.

            జనసేన షణ్ముఖ వ్యూహానికి వస్తే ముఖ్యంగా ఈ 6 విషయాలపై దృష్టి సారించింది అని చెప్పచ్చు. 1.ప్రజలు 2.అభివృద్ధి  3.సంక్షేమం 4.పర్యావరణం 5.పార్టీ 6.రాజకీయాలు. 2024 మాత్రమే కాదు రాబోయే ఏ ఎన్నికలు అయినా ఈ 6 అంశాలపై ఎన్నికలకు వెళ్లగలిగేంత సత్తా ఉన్న అంశాలను జనసేన ఎన్నుకుంది. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. రాష్టంలో బతకగలం అనే భరోసా ఇవ్వగలగాలి. సొంత ఊర్లు వదిలి ఎక్కడెక్కడో వలస ఉంటున్న ప్రజలను తిరిగి సొంత ఊర్లలో బతకగలిగే మార్గం చూపించాలి. ప్రజలు సంతోషాలతో, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ జీవించ గలిగే స్థాయి కల్పించాలి. ఏ పార్టీ కి అయినా కూడా ప్రజల సుఖ సంతోషాలు ముఖ్యం. అలాంటి ప్రజలకోసం వారికీ సుపరిపాలన అందించటానికి జనసేన తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. రాష్ట్రాన్ని అప్పు లేని దిశగా పయనింప చేయటమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా అప్పులు తీసుకొచ్చి వాటిని తమ జేబులలో నింపుకుంటున్నాయి. ఆలా కాకుండా, ఆర్ధిక నిబద్దత కలిగి ఉత్పాదక శక్తి పెంచటానికి అవసరమయ్యే ఖర్చు ఎక్కువగా పెట్టవలిసి ఉంటుంది. అలాంటి ప్రయత్నంలో భాగమే ఏటా లక్ష మందికి 5 లక్షల వరకు యువతకు సమకూర్చి, ఎవరైతే నలుగురికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారో వారికీ అవసరమైన మూల ధనం చేకూర్చటం ద్వారా 5 సంవత్సరాల కాలంలో, కనీసం ప్రతి ఒక్కరు నలుగురికి ఉద్యోగం ఇచ్చినా సుమారు 20 – 25 లక్షల కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే అవకాశం కల్పిస్తున్నారు.

         రాష్ట్రంలో ప్రజలను కులాలుగా మతాలుగా విడకొట్టే ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంత మందికి రుణాలు ఇప్పించగలిగారు. కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధులను తినటంలోనే సమయం అంతా అయిపొయింది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి అయ్యే ఖర్చు 10 వేల కోట్లు. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రలో 10 వేల కోట్ల ఖర్చు పెట్టి దాదాపు 25 లక్షల కుటుంబాలను ఎందుకు ముందుకు నడిపించలేకపోయారు? అమరావతి రాజధానిగా వైజాగ్ ని విశ్వ నగరంగా రూపొందించి విజయవాడ మరియు తిరుపతిని మహా నగరాలుగా నిర్మిస్తూ, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేసేట్టు, నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోటానికి ప్రపంచ పటంలో మన గుర్తింపు ఉండాలి. అదే విధంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే దానికి తగ్గ మౌలిక సదుపాయాలు ఉండాలి. హోటళ్లు రావాలి, రోడ్లు వెయ్యాలి, తగిన నీరు అందించగలగాలి, పెద్ద పెద్ద భవనాలు నిర్మించగలగాలి అదే విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకునేట్టు ఉండాలి. ఇన్ని రకాలైన సదుపాయాలు చెయ్యగలిగితే అప్పుడు వైజాగ్ ఒక విశ్వ నగరంగా తయారు అవుతుంది. నా కొడుకు హైదరాబాదులో ఉన్నాడు, లేకపోతే చెన్నైలో ఉన్నాడు, లేకపోతే బెంగళూరులో ఉన్నాడు అని ఇంకెన్నాళ్లు చెప్పుకుంటాం. నా కొడుకు మన రాష్ట్రంలో పని చేస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాడు అని చెప్పుకోవాలా వద్దా? అదే విధంగా తప్పుల నుండి నేర్చుకోవాలి. జనసేన అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంది. కేవలం రాష్ట్రము మొత్తం కలిసి ఒకటే ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో ఆంధ్ర లేదు. అమరావతి రాజధానిగా అలాగే విజయవాడ తిరుపతి మహా నగరాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. టయర్ 2 నగరాలు ఎంతగా పెంచగలిగితే అంతా జీవన ప్రమాణాలు ప్రజలకు పెరుగుతాయి. రాష్ట్రము ముందుకు వెళ్తుంది అంతే కాకుండా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితం కాకుండా అనేక పరిశ్రమలకు టయర్ 2 నగరాలు ఎంతో అవసరం. ఆ విధంగా వికేంద్రీకరణ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ సమాన న్యాయం చేయగలగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి సాధించాయి. ఏ విధమైన నగరాలను ఏర్పాటు చెయ్యలేదు. కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మూడు రాజధానుల పేరుతో భూ కబ్జాలు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నాయి. అంతే కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందా లేదు. అభివృద్ధి అంతా 2 కుటుంబాలకు మాత్రమే జరిగింది. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు. కేంద్ర ప్రభుత్వంలోని అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి నిధులు సంపాదించాలి. దాని ద్వారా రాష్ట్ర బడ్జెట్ మీద పడే భారం తగ్గుతుంది.

       పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అభివృద్ధి అనేది ఎప్పుడు విద్వంసంతో కూడుకున్నది అని. అదే విధంగా నూతన పారిశ్రామిక విధానం ద్వారా జరిగే విద్వాంసానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా, కాలుష్యం నివారించే విధంగా కచ్చితమైన విధానంతో ముందుకు వెళ్తుంది. దేశంలో అన్నం పెట్టే రైతు ఎప్పుడు వెనకపడే ఉంటాడు. దళారుల చేతుల్లో భూస్వాముల చేతిలో నలిగి పోతూనే ఉన్నాడు. పంటకి సరైన ధర దొరక్క, పంటని నిల్వ చేస్కునే గోడౌన్ లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి రైతులకు, స్వతహాగా రైతు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో వ్యవసాయం లాభసాటిగా చెయ్యటమే లక్ష్యంగా పని చెయ్యబోతున్నారు. మద్దతు ధర తగ్గకుండా ఉండేలా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి, పంట కాల్వలు కానీ, మినీ రిజర్వాయిర్లను ఆధునీకరించి వారికీ అండగా ఉండటమే కాకుండా, సమస్యలపైనా లోతున విశ్లేషణ జరిపి అవసరమైన నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రాయలసీమ ఎప్పటినుండో వెనక్కి నెట్టి వేయబడిన ప్రాంతంగా ఉంది. మౌలిక సదుపాయాలలో కానీ తగిన అవకాశాలలో కానీ వెనకబడి ఉంది. అలాంటి రాయలసీమని ముందుకు తీసుకెళ్లేవిధంగా, రాజధానిని త్యాగం చేసిన కర్నూల్ ని గౌరవిస్తూ, రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన దామోదరం సంజీవయ్య కర్నూల్ జిల్లాగా మారుస్తూ, రాయలసీమ నుండి వలస వెళ్లిపోయిన యువతని మళ్ళీ రాయలసీమలో బతకగలిగేలా తీసుకోవాల్సిన అన్ని విధానాలు తీసుకునేలా ముందుకు జనసేన సాగుతుంది. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా, గత రెండు ప్రభుత్వాల ఇసుక విధానాలతో విసిగిపోయిన ప్రజలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ ఇసుక ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా అదనపు గదుల నిర్మాణానికి అవసరమైన ఇసుక కూడా అందించటం జరుగుతుంది. జాబ్ కేలండర్ లేని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చెయ్యటమే కాకుండా, వారం రోజుల్లో రద్దు చేస్తా అని చెప్పి 3 ఏళ్ళు అవుతున్న రద్దు చెయ్యని సీపీస్ విధానాన్ని రద్దు చేసి, వేతన సవరణ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెయ్యటం జరుగుతుంది.

         మినీ మేనిఫెస్టో ను చాలా అద్భుతంగా రూపొందించి, రాష్ట్రంలోని అన్ని వర్గాల, ప్రాంతాల ఆకాంక్షలను గుర్తిస్తూ, ” మన ఆంధ్ర ప్రదేశ్ – మన ఉద్యోగం” నినాదంతో ప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి కుటుంబాన్ని పోషించగలిగే స్థాయి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో జనసేన పని చేస్తోంది. అంతే కాక ఏ ఒక్క రంగాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకి కానీ, సేవా రంగానికి కానీ తగిన తోడ్పాటు అందిస్తూ, ఆర్ధిక నిబద్దతతో కూడిన ఆర్ధిక ప్రగతికి జనసేన పాటుపడుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర బడ్జెట్లో సగ భాగం కూడా లేదు. చెయ్యలేని హామీలు కానీ, బడ్జెట్ ని దాటి పోయే హామీలు కానీ జనసేన ఇవ్వదు. విజన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. పరిపాలన చేపట్టడంలో పరిణితి చూపెట్టాడు. ఏ వర్గాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ, ఏ రంగాన్ని కానీ వదిలెయ్యకుండా, రాష్ట్ర సర్వ ముఖ అభివృద్ధికి ప్రతి రూపమే ఈ మినీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ని అమలు జరిపితే ఖచ్చితంగా మరో 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ చెప్పుకోతగ్గ పురోగతి చూడగల్గుతుంది. దానికి మనం చెయ్యగలిగింది ఒక్కటే, మన ఓటు అనే ఆయుధాన్ని బలంగా బాలట్ బాక్స్ పై గుద్ది 2024 లో జనసేన ప్రభుత్వనాన్ని స్థాపించటమే.

Manifesto ఆంటే, it’s a promise. 

#Written By

ట్విట్టర్ : @vss_ramesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
IMG-20240403-WA0002
ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత
IMG-20240331-WA0016
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
IMG-20240319-WA0007
అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way