గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక ఎన్జీవో హోం లో ఉపాధ్యాయుల దినోత్సవము సందర్భంగా కంచనపల్లి నాగరత్నకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో పాటు గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన ఆర్కే ని అభినందించి సన్మానం చేసిన మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని యువత సమాజానికి తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తు ఉండాలని అన్నారు. అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తు ఆకలితో ఉన్న అనార్ధలకు ఆహారం అందజేసి ఆకలి చావులు లేకుండా చేస్తున్న ఆర్కే వారియర్స్ ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉండిపోతారని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరూ ఆర్కే వారియర్స్ ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచనపల్లి రత్న కుమారి సేవా ట్రస్ట్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొవడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com