మైలవరం ( జనస్వరం ) : దాములూరులో జనసేన రచ్చబండలో ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం దిశగా కృషి చేస్తామని, పేదలను ఆర్ధికంగా నష్ట పరుస్తున్న జగన్ ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్పాలని ఇంచార్జ్ అక్కల గాంధీ మోహన్ అన్నారు. ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో దామలూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రకటించటం జరిగింది. దాములూరు గ్రామ అధ్యక్షునిగా పంది శ్రీను, ఉపాధ్యక్షులుగా గణేష్, నజీర్ ను ప్రకటించడం జరిగింది. గ్రామ ప్రధాన కార్యదర్శిగా రాజేష్, సుమారు 22 మంది సభ్యులతో ఈ కార్యవర్గం రూపుదిద్దుకుంది. గ్రామంలో జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి చింతల లక్ష్మి, శ్రీమతి రావి సౌజన్య మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com