పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలంలో, ముక్కెళ్త, మారెళ్ళ గ్రామాల్లో పర్యటిస్తూ, గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ముక్కెళ్ల మారెళ్ళ జనసేన పార్టీ నాయకులు, రామాంజి, లాలప్ప, వీరాంజనేయులు, పుండు కూర నాయుడు, వీరేశ్, ఎర్రి స్వామి, రాజశేఖర్, ఆధ్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసా గించడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ, తుగ్గలి మండలంలో ముక్కెళ్ల ,మారెళ్ళ గ్రామాల్లో జనసేన ప్రజా పోరాట యాత్ర ద్వారా గ్రామాలలో పర్యటించడం జరిగింది. అనేక సమస్యలు గ్రామాలలో సమస్యలు మాదృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. అలాగే మేము కళ్లారా చూశాం, ముక్కెళ్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్లపై నీరు చేరి గుంతలు పడిన రోడ్ లో ఈ కాలనీవాసులు తిరుగుతున్న సంఘటన మేము చూశాం, అలాగే 6,7వార్డులో సిసి రోడ్లు లేవు ఈ వార్డులో కొంతమంది మమ్మల్ని కూడా నిలదీయడం జరిగింది. మీరు ఎలక్షన్ వస్తున్నాయి అని చెప్పి ఓట్లు కోసం అడగడానికి మా దగ్గరకు వస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా, మా సమస్యలు మాత్రం తీర్చలేక పోతున్నారు, మేము అనేక సార్లు ఇలాగే మోసం పోతున్నాం, ఇప్పటికైనా మీరు ఈ సమస్యలు తీర్చండి అని, గ్రామస్తులు చెప్తుంటే చూసిన మాకు ఎంతో బాధ అనిపించింది. అదేవిధంగా డ్రైనేజీ కాలవలు 6,7 వార్డులలో నిండిపోయనా కూడా డ్రైనేజీ క్లీన్ చేయకుండా ఉన్న దృశ్యాలు చూశాం మరీ ముఖ్యంగా మెయిన్ రోడ్లో మోకాలు లోతు నీరు ఆగిన దృశ్యాలు చూశాం. అలాగే మారేళ్ల గ్రామం లో కూడా ప్రధాన రహదారి మధ్యలో నీరు నిలిచిన సంఘటన చూశాం. బీసీ కాలనీలో, సీసీ రోడ్లు లేవు ద్రైనేజీ వ్యవస్థ లేదు, అదేవిధంగా మారేళ్ల గ్రామం లో కూడా బొందిమడుగులకు వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఎస్సీ కాలనీ కి రహదారి వెంట ఎస్సీ కాలనీ వాసులు మోకాలు లోతు గుంతల పడిన రోడ్లో వెళుతున్నాము చెప్పడం చాలా బాధాకరం. సమస్య ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చూశాం ఇప్పటికైనా, ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.