Logo
Date of Publish : 14 December 2025, 8:25 pm
Editor : Sake Naresh

న్యూరాలజీ బాధితుడికి జనసేన ఆర్థిక సహాయం అందజేత

నెల్లూరు, అక్టోబర్ 14, (జనస్వరం) : కష్టంలో ఉన్న ప్రతి గుండె పవన్ కళ్యాణ్ వైపు ఆశతో చూస్తుందని జనసేన నాయకులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, గ్రామం, సమాజం బాగుండాలనే ఆలోచనతో సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వం పవన్ కళ్యాణ్‌దని వారు అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్లైండ్ క్రికెట్‌లో కప్పు గెలిచిన కెప్టెన్ దీపిక వంటి వారిని సమాజానికి ఆదర్శంగా నిలిపిన నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. న్యూరాలజీ వ్యాధితో బాధపడుతున్న మొయినౌద్దీన్‌కు క్వీన్స్ ల్యాండ్స్ జనసేన ఆస్ట్రేలియా సహకారంతో రూ.30 వేల ఆర్థిక సహాయ చెక్కును నెల్లూరు జనసేన జిల్లా కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ చెక్కును బాధితుడి తండ్రి సైలాఫ్‌కు జనసేన నాయకులు అందజేశారు. గతంలో జనసేన పార్టీ తరఫున మొయినౌద్దీన్‌కు వీల్ చైర్ అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం మరింత సహాయం అవసరమని తెలుసుకున్న క్వీన్స్ ల్యాండ్స్ ఆస్ట్రేలియా జనసేన తరఫున హేమ నాయుడు, అడపా పవన్, ఇందిరా, మురళి, పగడాల ప్రసాద్ కలిసి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారని తెలిపారు. సమాజానికి మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలు రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నాయకులు వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం‌గా పవన్ కళ్యాణ్ చూపుతున్న కార్యదక్షతను జనసేన నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని పార్టీ లక్ష్యాలు, ఆశయాలను సమర్థవంతంగా నెరవేర్చాలని వారు పిలుపునిచ్చారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన జనసేన టీంకు మొయినౌద్దీన్ తండ్రి సైలాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, రూరల్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయం ఇంచార్జ్ జమీర్, ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు చదలవాడ హరీష్, ఏఎంసీ డైరెక్టర్ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, నాయకులు రవికుమార్, గుర్రం కిషోర్, ప్రసాద్, మహేష్ శర్మ, సురేష్, మనోజు, శ్రీకాంత్, నరహరి, పవన్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com