Logo
Date of Publish : 07 December 2020, 4:06 pm
Editor : Sake Naresh

జనసేన నిరసన దీక్ష : పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి

జనసేన నిరసన దీక్ష : పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి

               నివర్ తుఫాన్ కి నష్టపోయిన రైతులకు మద్దతుగా నిరసన దీక్ష జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన దీక్ష కు పిలుపు ఇచ్చారు. కావున ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో రైతన్నలు, జనసైనికులు, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు దీక్షలో పాల్గొన్నారు. పిఠాపురం ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి మాట్లాడుతూ
పిఠాపురం నియోజకవర్గం లో సుమారు గా 52000 ఆయకట్టు ఎకరాలు ఉండగా అందులో 36200.. సుమారుగా 70% ఎకరాలు నష్ట పోవడం జరిగింది. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం అయింది, నష్టాన్ని భరించలేని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. దీనిని జనసేన పార్టీ గుర్తించి నష్టపోయిన రైతులకు రూ. 25000 నుంచి 35000 పరిహారం చెల్లించాలని; అలాగే తక్షణమే రూ. 10000/- భరోసాగా ఇవ్వాలని; మరణించిన రైతులకు రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలనుంచి వచ్చిన రైతులు; కోలా ప్రసాద్, ఊట నానిబాబు, మర్రి దొరబాబు, బండి ఏసుబాబు, తోట ప్రసాద్, గొల్లపల్లి వీరబాబు, గాది గోపి, ఓరుగంటి పెద్దకాపు, మెయిల్ల నాగబాబు, సుంకర కృష్ణవేణి, పిల్ల రమ్య జ్యోతి, వెంకట్ లక్ష్మి, నాగలక్ష్మి, కోలా దుర్గ, రాహుల్, గరగ బాబి, చక్రధర్, పాలనాటి మధు, దుర్గాప్రసాద్, పిడుగు గోవిందరాజు, సుబ్బు, రఘు, సూరిబాబు, స్వామి రెడ్డి సుబ్రహ్మణ్యం, యాగ సతీష్, దుర్గాప్రసాద్, పిల్ల దినేష్, కృష్ణ, పండు, తదితరులు బిజెపి కో కన్వీనర్ గండి కొండలరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాట్ల సూర్యనారాయణ రాజు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అబి రెడ్డి, అప్పన్నా రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కర్నిడి తతి లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com