నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో అధికారపార్టీ ఎం ఎల్ ఏ లు అభివృద్ధి వికేంద్రీకరణకు ర్యాలీలు చేయడం హాస్యస్పదంగా ఉందని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆరోపించారు. వెంకటగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సైదాపురం మండలం కన్వెనర్ తొండమనాటి శివ, ఉపాధ్యక్షులు మగ్గం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సైదాపురం-డేగపూడి రోడ్లు దుస్థితిపై మండలం కేంద్రము నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా గుడ్ మార్నింగ్ సి ఎం సార్ గాఢ నిద్ర లేవండి సార్ రోడ్లు వేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రోడ్లు దారుణంగా ఉంటే ప్రజల ప్రాణాలను గాలి కొదిలేసి రాష్ట్రాన్ని మైనింగ్ ల ను దోచుకుంటు నిరుద్యోగ సమస్య పట్టించు కోకుండా మార్కెట్ లో సామాన్యులకు అందని ఎత్తులో ధరలను పెంచేస్తున్నారని మండిపడ్డారు.ఈ సందర్బంగా రోడ్డు దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేయాలని తహశీల్దార్ పాలక్రిష్ణకు జనసేన నాయకులు జనసైనికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా కార్యదర్శి చామండి రాదమ్మ, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పూసల లక్ష్మి మల్లేశ్వర రావు, నియోజకవర్గ కాపు సంక్షేమసేన అధ్యక్షులు బీసాబత్తిని లక్ష్మి కాంత్ జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com