అనంతపురం ( జనస్వరం ) : అనంత నగర ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి జనసేన జిల్లా అధ్యక్షులు & అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇదివరలో గుంతల మయమైన అనంత రోడ్ల దుస్థితి పరిశీలించిన వరుణ్ గారు జనసేన శ్రేణులను మమేకం చేసి శ్రమదాన కార్యక్రమం ద్వారా ఫోన్ కాల్ చేసిన వెంటనే ఆయా కాలనీలో ఏర్పడ్డ రహదారుల గుంతలను పూడ్చి వేసే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విధితమే. ఇదే నేపథ్యంలో మండు వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు.. ముఖ్యంగా అనంత అర్బన్ నియోజకవర్గం ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వాలన్న సంకల్పంతో జనసేన రక్షిత మంచినీరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం స్థానిక కోర్టు రోడ్డు వరదాంజనేయ స్వామి దేవాలయంలో నీటి పంపిణీ చేసే వాహనాలకు ప్రత్యేక పూజలు జరిపించి టి.సి.వరుణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో మునిసిపల్ నీటిని తాగే పరిస్థితి దాదాపు కనుమరుగవుతోందన్నారు. ప్రతి కుటుంబ రక్షిత మంచినీటి కోసం డబ్బులు వ్యయం చేస్తోందని.. కొన్ని స్లమ్ ఏరియాలో కలుషితమైన నీటిని తాగుతున్నారని తమ దృష్టికి రావడంతో అనంత ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలి.. పేద కుటుంబాలపై నీటి భారాన్ని నివారించాలి అన్న సంకల్పంతో జనసేన రక్షిత మంచినీటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రెండు ట్రాక్టర్లు, ఏడు ఆటోలు మొత్తం తొమ్మిది వాహనాలతో అనంత అర్బన్ నియోజకవర్గ పరిధిలో రక్షిత మంచినీటి ఉచిత పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. హెల్ప్ లైన్ 9398854513 నంబర్ కు కాల్ చేసిన 30 నిమిషాల వ్యవధిలోనే వారి ఇంటి ముందుకు వాహనం వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అనంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టి.సి.వరుణ్ గారు కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు రాపా ధనంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, సిద్దు, సంయుక్త కార్యదర్శి ముప్పూరి కృష్ణ, జయమ్మ, నగర ఉపాధ్యక్షులు సదానందం, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు హుస్సేన్, దరాజ్ బాషా, నగర కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్, నగర సమస్త కార్యదర్శులు ఆకుల అశోక్, మంగళ కిష్ట, మరియు నాయకులు నజీమ్, హిద్ధూ, నవీన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.