ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ జనసైనికులు తలపెట్టిన జనంలోకి జనసేన అనే కార్యక్రమం ఒంగోలులోని 38 మరియు 39 డివిజన్లలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సమస్యల గురించి అక్కడ నివసించే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డివిజన్ లలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని నాలుగు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ వస్తుందని వచ్చిన ఇంటికి ఐదు నుంచి పది బిందెలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు ఇవ్వడం లేదని కనీసం స్థానికంగా ఉన్న బోర్లు బోర్లు కూడా బాగు చేయడం లేదని వాపోయారు సైడ్ కాలవలు కూడా లేక ఎక్కడ మురుగునీరు అక్కడే ఆగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతేకాకుండా ఇంటి స్థలాలు కూడా ఇక్కడ వారికి లేవని సొంత ఇల్లు లేని పేదలమైన మేము ఇంటి అద్దె కూడా కట్టుకోలేని ఈ పరిస్థితుల్లో ఉన్నామని గతంలో చెల్లించిన ₹500 జి ప్లస్ త్రీ ఇళ్లను ఇప్పటివరకూ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు బండారు సురేష్, ఈదుపల్లి గిరి గౌరీశంకర్, గారా నారాయణ రత్నాకరం సాయి పర్చూరు సాయి, చాకిరి శీను, హరీష్, ఉంగరాల మోహిత్, వడ్డీ రాజేష్, హర్ష నాగరాజు, సుబ్బారావు, హరి పాల్గొన్నారు.