Logo
Date of Publish : 25 April 2023, 3:45 pm
Editor : Sake Naresh

తోటపల్లిగూడూరు మండల కేంద్రంలో జనం కోసం జనసేన కార్యక్రమం

           సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరు మండల కేంద్రంలోని మహలక్ష్మీపురం నందు 9వ రోజు మంగళవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నడం సిగ్గుచేటుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. రాజధాని ఏది అనేది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అంతటి దౌర్భాగ్యంలో వున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. గ్రామాలలో చూస్తే పంచాయతీ నిధులు లేక పంచాయతీలలో కనీసం కాలువల్లో బ్లీచింగ్ కొట్టే దానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి. పల్లెటూర్లు పట్టుకొమ్మలు అంటారు. మరి నేడు పల్లెటూర్లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. పల్లెలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజధాని పూర్తిస్థాయిలో ఏర్పడాలన్న ఒక జనసేనతోనే సాధ్యం. ఈరోజు గ్రామాలలో జనసేనకి పెరిగిన ఆదరణ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన విజయకేతనం ఎగరవేయడం ఖాయం. రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు సర్వేపల్లి నియోజకవర్గం మీదనే ఆధారపడి ఉంటాయి. మేము జనసేన విజయకేతనం ఎగరవేసేంతవరకు అలుపెరగని పోరాటం చేస్తాం. ఈ కార్యక్రమంలో శ్రీహరి, విజయ్, శ్రావణ్, సందీప్, అభి, శివకృష్ణ, వాసు, కిషోర్, రాము, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com