సర్వేపల్లి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం

సర్వేపల్లి

       సర్వేపల్లి ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇప్పటికీ సొంత ఇల్లు, సరైన వసతులు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో అట్టడుగున్న ఉన్న గిరిజనులు ఉన్నారు. వారికి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. అలాంటి పరిస్థితులలో గిరిజనులు ఉంటే ప్రభుత్వాలు మారిన పాలకులు మాత్రం వారి జీవితాలలో మాత్రం వెలుగులు నింపిన పరిస్థితులు లేవు. ఇప్పటికీ కాలువ గట్ల మీద, గుట్టల మీద, చెట్ల కింద నివాసం ఉంటున్నారంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది. మరి పేదల ఇల్లు కట్టిస్తామని నా మాటలు శుద్ధ మూటలుగా మిగులుతున్నాయి. కానీ ఇప్పటివరకు పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించిన దాఖలు లేవు. అయితే కాలువ గట్టున నివాసం ఉంటున్న గిరిజనులు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్లకి ఇళ్ల స్థలాలు ఇచ్చేమని చెప్పి చెప్పారు. కానీ అవి పెండింగ్లో ఉన్న భూములను ఇళ్ల స్థలాలుగా ఇచ్చి ఆశ చూపించి కోర్టులో పెండింగ్లో ఉంది అని చెప్పి చెప్పడం చాలా సిగ్గుతో కూడినటువంటి విషయం. ప్రభుత్వం ఇకనైనా సరే కళ్ళు తెరిచి ఏదైతే ఈ కాలువ గట్టు నివాసం ఉంటున్న పేద గిరిజనులకి ఉండటానికి సొంత ఇల్లును నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీహరి, విజయ్, ప్రేమ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way