Logo
Date of Publish : 13 September 2022, 3:52 am
Editor : Sake Naresh

పెదరావుపల్లి, చినరావుపల్లిలో జనం కోసం జనసేన కార్యక్రమం

           విజయనగరం ( జనస్వరం ) : అశాంతి, అవినీతి పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నీతివంతమైన రాజకీయాలకు తెరతీసిన పవన్ కల్యాణ్ గారి లాంటి వ్యక్తి నాయకత్వం రాష్ట్రానికి అవసరమని జనసేన పార్టీ ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. నాయకులు గొరపల్లి రవికుమార్ గారి ఆధ్వర్యంలో కొత్తవలస మండలం పెదరావుపల్లి, చినరావుపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధికారంలోకి వచ్చాక అమలుచేయబోయే షణ్ముఖ వ్యూహం గురించి ప్రచారం చేశారు. వబ్బిన సత్యనారాయణ గారు మాట్లాడుతూ జనసేన షణ్ముఖ వ్యూహంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ప్రజలు స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. ఇటువంటి గొప్ప ఆలోచనలు ఉన్న పవన్ కల్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలంతా బలపరచాలని కోరారు. పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్ గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఈ స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు. నాయకులు వబ్బిన సన్యాసినాయుడు మాట్లాడుతూ భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ గురించి ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తూరిబిల్లి విజయ్ కుమార్, మల్లువలస శ్రీను, నక్కరాజు సతీష్, రుద్ర నాయుడు, రామ కాశీ, మదిన రాజేష్, చందక హర్ష, మదిన రమేష్, టి.దేవీ ప్రసాద్, జి. గౌరీ నాయుడు, ఏడువాక రాజు, గొరపల్లి వెంకటరావు, పెంటకోట శ్రీను, ముచ్చ శ్రీను, ఇరోతి రమణ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com