కార్వేటి నగరం (జనస్వరం ) : నియోజకవర్గంలో మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ త్వరలో జనం కోసం జనసేన కార్యక్రమం నియోజకవర్గంలో అన్నీ మండలాల్లో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రతీ ఇంట్లో ఉన్న వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు కోవడం, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలియ జేశారు. గుర్తించిన వాటిని సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించి, అవసరం అయితే మహా ధర్నాలు ప్రజలకోసం చేయడానికి సిద్దమని తెలిపారు. అంతిమ అధికారం ప్రజల చేతికి అందివ్వడమే మా ముందున్న సవాల్ అని ఈ సందర్బంగా తెలియజేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని, నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి సతీష్, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, గంగాధర నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు శివ ఉన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com