
ఆలూరు, (జనస్వరం) : గడపగడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నేకల్లు వెంకప్ప ఆదేశాల మేరకు జనసేన నాయకులు దేవనకొండ మండలంలోని పల్లెదొడ్డి, గద్దేరాళ్ళ, కప్పట్రాల, జిల్లెబుడకల, ఓబుళాపురం, కరివేముల గ్రామల్లో పర్యటించారు. గ్రామాల్లోని మహిళలు, పెద్దలు, యువతీయువకులకు జనసేన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసాలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సొంత డబ్బులను వెచ్చించి ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష సాయం చేశారని వివరించారు. జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ తెర్నేకల్లు వెంకప్ప ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అతివల చదువు – అవనికి వెలుగు” కార్యక్రమం గురించి వివరించారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీకి ఓటు వెయ్యలని ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆంథోబి, బడేసాబ్, మహేష్, నరసింహ, చంద్ర, రాజు, అంపయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.