
సంక్రాంతికి సందర్బంగా అధిక సంఖ్యలో అందరూ సొంత ఊళ్లకి చేరుకునే సమయం కనుక వారందరితో మమేకం కోసం పాతపట్నం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ గేదెల చైతన్య గారు దాదాపు మూడు రోజులు నిర్విరామముగా పలు పంచాయతీలలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, పంచాయతీ సమస్యలన్నీ తెలుసుకుని, జనసైనికులతో ముఖా ముఖి నిర్వహించారు. పార్టీ బలోపేతం దిశగా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. యువ నాయకులకు జనసేన సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంగా దిశగా నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.