
మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారి అధ్యక్షతన సిటియం పంచాయతీ పూలోల్ల పల్లెలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నుండి 30 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నాయకులు వెంకటేష్, చిన్న రెడ్డి, గంగాధర్, శ్రీధర్, పవన్, రాజు, సాగర్, మురళి, అంజి పల్లె ప్రజలు మదనపల్లి జనసేన నాయకులు ఆకుల శంకర, ధరణి, చంద్ర శేఖర్, తొక్కోల శివ,వీర మహిళలు పాల్గొన్నారు .