
విశాఖపట్నం ( జనస్వరం ) : టీం రాజకీయం ఆధ్వర్యంలో జనసేన పార్టీ గత నాలుగు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలను ముద్రించి వారాహి యాత్రలో సామాన్య ప్రజలకు పంచనున్నారు. ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న టీం రాజకీయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో జనసేన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, పోరాటాలను జనసేనాని సహాయాలను చక్కగా వివరించారన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. విశాఖ ఫ్లోర్ లీడర్, ౩౩ వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. కరపత్రాల ద్వారా జనసేనపార్టీ చేసిన పోరాటాలను సామాన్యులకు తెలియజేయడం కోసం కృషి చేస్తున్న0దుకు టీం కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నందుకు టీం రాజకీయంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.