Logo
Date of Publish : 10 April 2023, 4:55 pm
Editor : Sake Naresh

అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ప్రజావేదిక సభ కార్యక్రమం

         అనకాపల్లి ( జనస్వరం ) : అనకాపల్లి మండలం క్లస్టర్-1(అక్కిరెడ్డిపాలెం, గొలగాం, మారేడుపుడి, భట్లపూడి, గోపాలపురం) పంచాయతీల అధ్వర్యంలో జరిగిన జనసేన ప్రజావేదిక సభలో ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు గారు పాల్గొన్నారు మారేడుపుడి గ్రామం నుండి సభా స్థలం వరకు ఐదు పంచాయితీలలో సుమారు 15కిమీ భారీ బైక్ ర్యాలీ, ఆలయాల దర్శనం, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన కు పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు అందరూ సిద్ధపడ్డారు అని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతుంది అని అన్నారు. ఇప్పటివరకు జనసైనికులు అందరూ కష్టపడింది ఒక ఎత్తు అయితే ఈరోజు నుండి పోలింగ్ బూత్ లో ప్రజలతో జనసేనకు ఓట్లు వేయించేంత వరకు పడాల్సిన కష్టం ఒక ఎత్తు అని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో వైసీపీ నాయకులు ఏ విధంగా అవినీతి చేస్తున్నారో ప్రజలకు వివరించారు. తాను ఎప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలోనే ఉంటానని ఎట్టి పరిస్థితుల్లో అనకాపల్లిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి గా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు  మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన గెలుపు, అనకాపల్లిలో జనసేన గెలుపు చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు 40మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ భాస్కరరావు గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం నాయకులు గెంజి సత్యారావు, సేనాపతి రవి, బంటు రవి, పేరపు జగదీష్, పిన్నంరజు శివాజీ, గొర్లి ప్రసాద్, వెంకటరమణ, బొచ్చా రమణ, కిషోర్, ముసిలినయుడు, మోహన్, సూర్యచంద్ర రావు, గొల్లవిల్లి సూరిబాబు, వీరమహిళలు పిన్నంరాజు శిరీష, రత్నం, ఐదు పంచాయతీల జనసైనికులు, నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com