Logo
Date of Publish : 18 July 2022, 4:57 pm
Editor : Sake Naresh

CG రాజశేఖర్ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలంలో జనసేన ప్రజా పోరాట యాత్ర

          పత్తికొండ ( జనస్వరం ) : వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో జనసేన నాయకుడు నాయకుడు CG రాజశేఖర్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ జనసేన ప్రజా పోరాట యాత్ర ద్వారా, ఈరోజు బుక్కాపురం, కలగొట్ల, కృష్ణాపురం, గ్రామాలలో అనేక సమస్యలు కళ్ళారా చూశామని,  గ్రామాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి, వచ్చిన తర్వాత గ్రామాలలో త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని, గ్రామస్తులు చెబుతున్న ఆవేదన బాధ మాకు అర్థమైంది, కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బంది బాధపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ గ్రామస్తులు సమస్యలు తీర్చాలని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నాయని, వీటి పైన దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల నాయకులు, పుల్లగుమ్మి పరమేష్, ఆగిపోగు నాగరాజు, నాయకల్ బాబ్జి, బడల్లా ఆదెన్న, జనసేన నాయకులు కాల్వ భాస్కర్, గద్దల రాజు, చాకలి నాగేశ్వరరావు, ఈడిగ చిరంజీవి, నరసింహుడు, ఆది, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com