
బొబ్బిలి ( జనస్వరం ) : తెర్లం మండలం ఎం బుర్జివలస గ్రామంలో బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా పర్యటించి సమస్యలును తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలను త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, తెర్లం సీనియర్ జనసేన నాయకులు పాండ్రంకి అప్పారావు, కొనారి లక్ష్మణ రావు, రఘు, కృష్ణ, రవి, రాంబాబు, సింహాచలం, జనసైనికులు పాల్గొన్నారు.