
తెలంగాణ ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయలను ముందుకి తీసుకెళ్లే భాగంలో జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి వరంగల్ జిల్ల ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు అయిన జనంలోకి జనసేన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఒకటీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గల ప్రజలను దారుణంగా మోసం చేసింది కేవలం ఎన్నికల కోసమే హామీలు ఇచ్చి తుంగలో తొక్కేసారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం ఆ తర్వాత విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై బలంగా పోరాటం చేయాలని జిల్లా నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ, ఉపాఅధ్యక్షులు గడ్డం రాకేష్, సెక్రటరీ శేషాద్రి సందీప్, నర్సంపేట నియోజకవర్గం నాయకులు మేరుగు.శివకోటి యాదవ్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చింత రమేష్ పాల్గొన్నారు..