గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండలం, మాంబేడు పంచాయితీ, మాంబేడు గ్రామంలో జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ ) కార్యక్రమం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్రవంతి రెడ్డి తో పాటు, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఇంటిని సందర్శించి, భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు, గ్రామస్తులతో కలివిడిగా మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీలకు ఒక అవకాశం ఇవ్వాలని, రాష్ట్రo కోసం, ప్రజల సంక్షేమం కోసం, వారి శ్రేయోభివృద్ధి కోసం, కోల్పోయిన రాష్ట్ర అభివృద్ధిని పునరుద్ధరించుట కోసం ఇరువురు గొప్ప ఆలోచనలతో, పగడ్బందీ ప్రణాళికతో మీ ముందుకు వచ్చారని, వారికి ఒక అవకాశం ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు, మీ అమూల్యమైన ఓటుతో నెలకొల్పాలనిఈ సందర్భంగా కోరారు. త్యాగం చేసే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండి ని ప్రతి ఇంటిని వేడుకున్నారు. మండలాన్ని అభివృద్ధి చెందించడంలో తాము ఎప్పుడు ముందుంటామని, నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఈ మండలంలో కూడా విశేష సేవలు అందించారని, ప్రజల కోసం పోరాటాలు చేశారని, మండల అభివృద్ధి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి వెదురుకుప్పo మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాల్సిందిగా గతంలో డిమాండ్ చేశారన్నారు. తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి డాక్టర్ యుగంధర్ పొన్న అని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. మాకు ఒక అవకాశం ఇవ్వండని, చరిత్ర సృష్టించి చూపిస్తామని, మండలంలో సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు గోపతి మునిరత్నం శెట్టి, యం యం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com