Logo
Date of Publish : 13 February 2022, 5:52 pm
Editor : Sake Naresh

మత్స్యకార అభ్యున్నతి యాత్రలో పాల్గొన్న జనసేన పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషు కుమారి

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం నుంచి భారీ ర్యాలీగా నాయకులు, జనసైనికులు, మత్స్యకారులతో కాకినాడ రూరల్ సూర్యరావుపేట వెళ్లి శ్రీ నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికారు. మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా ఆదివారం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తో పాటు, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఇతర నాయకులతో కలిసి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మత్స్యకార అభ్యున్నతి యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖ నేతలు, పిఠాపురం నియోజవర్గ మండల అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు, జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఇంఛార్జ్ లు ప్రముఖ నాయకులు అంతా ఈ అభ్యున్నతి యాత్ర కార్యక్రమం చేపట్టి మత్స్యకారులకు, వారి కుటుంబాలకు, అండగా వారి కష్టసుఖాల్లో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా మత్స్యకారులు పడుతున్న పలు సమస్యలను తెలుసుకుని వారికి అండగా జనసేన పార్టీ, జనసేన రాష్ట్ర అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఏప్పుడు ఉంటారని భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనసేనాని ఆశయాలతో వారి ఆదేశాల అనుసారం ప్రజా సమస్యలపై నిరంతరము జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలిపారు. ప్రజాసమస్యలు, ప్రధాన రహదారి సమస్యలపై, రైతు సమస్యలపై పోరాడామని,  మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా వారి కొరకు, ఎవరికి ఏ కష్టం వచ్చినా జనసేనాని అండగా ఉంటారని ఒక భరోసా ఇచ్చినారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com