Logo
Date of Publish : 17 October 2021, 2:09 pm
Editor : Sake Naresh

ప్రజాసమస్యలను తీర్చడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం ~ జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

   విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ విజయనగరం ఇంఛార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు తలపెట్టిన గ్రామ గ్రామాన జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం నియోజకవర్గ పరిధిలో సారిక గ్రామంలో అమె ప్రజాధర్భార్ ను నిర్వహించారు. ముందుగా ఉదయాన్నే సారిక గ్రామంలో, జనసేన పార్టీ సిద్ధాంతాలు, గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమ వివరాలతో కూడిన కరపత్రాలను జనసైకులు బొబ్బాది చంద్రునాయుడు (చందు) మరియు రాజేష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టారు. అనంతరం జనసేన నాయకురాలు శ్రీమతి పాలవలస యశస్వి గారు సారిక గ్రామంలో రచ్చబండ వద్ద ప్రజాధర్భార్ ను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన వినతులు తీసుకుని ప్రజాసమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే ప్రతీ ఆదివారం నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లోను గ్రామ గ్రామాన జనసేన పేరుతో ప్రజాధర్భార్ ను, మరియు కార్పొరేషన్ పరిధిలో కూడా నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆసమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలనుంచి పెన్షన్లు, రేషన్ కార్డ్లు అర్దాంతరంగా ఆపివేశారని వినతులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారిక గ్రామ జనసైనికులు కృష్ణ, సాయి, సందీప్, సాయి, నాయుడు, జగదీష్, ఎ.సాయి, జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు), రవితేజ, కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com