Logo
Date of Publish : 10 January 2022, 3:50 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 13వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం

    శ్రీకాళహస్తి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా గారు ప్రారంభించిన KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని SDK నగర్ లో పర్యటించి, ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మఖ్యంగా రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ కాలువలు లేవు. పట్టణంలోనే మునిసిపాలిటీకి అధికంగా పన్నులు ఇళ్ళ నిర్మాణం కోసం మా ప్రాంతం నుండే కడుతున్నాము. కానీ మా ప్రాంత ప్రజల సమస్యలను మునిసిపల్ సిబ్బంది అస్సలు పట్టించుకోవడం లేదు అని, వర్షం సమయంలో డ్రైనేజీ కాలువలు,రోడ్లు నిర్మాణం లేనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వినుత గారికి తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టరు గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాడుతామని వినుత గారు ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల కానిస్టేబుల్ వేధింపులకు గురి అయ్యి ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్ ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. దోషులకు శిక్ష పడేవరకు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, నాయకులు గిరీష్, సురేష్, నితీష్, చందు, కృష్ణమూర్తి, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com