బాపట్ల, (జనస్వరం) : కార్యకర్తల సంక్షేమానికి జనసేన పార్టీ వినూత్న ఆలోచన చేసిందని గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి తెలిపారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యకర్తలను ఓటరుగా భావించే ప్రస్తుత కాలంలో కార్యకర్తల ఆపద సమయంలో అండగా ఉండాలని భావించి వారి సంక్షేమానికి జనసేన పార్టీ కృషి చేయడం గర్వంగా ఉందన్నారు. కార్యకర్తల శ్రేయస్సు కొరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం నమోదుకు ఆదేశించారని తెలిపారు. సంయుక్త కార్యదర్శి నామన శివనారాయణ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా జనసేన పార్టీ సభ్యత్వం స్వికరించాలని అందుకు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డుతో పాటు 500 రూపాయలు నగదు చెల్లించి సభ్యత్వం పొందాలని సూచించారు. సభ్యత్వం పొందిన వారికి ఐదు లక్షల రూపాయల బీమా అందుతుందని అలాగే వైద్యశాలలో చికిత్స పొందుతూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. కార్యకర్తలను అవసరం కోసం వాడుకునే పార్టీలో ఉన్న నేటి తరుణంలో జనసేన పార్టీ వారి సంక్షేమానికి కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. కావున బాపట్ల నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వం సేకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తార్, సురేంద్రబాబు, సుజిత్, ఆసిఫ్, మణికంఠ, పర్వతరెడ్డి ఎలమంద, ప్రసాద్, గంటా నాగమల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.