ఉంగుటూరు ( జనస్వరం ) : ప్రజల సమస్యలు పరిష్కారానికి జనసేన పార్టీ ముందు వుంటుందని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. 4వ రోజు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని ఈ పరిస్థితులు మారాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లు మెరుగుపరచలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన మంచి నీరు ప్రజలకి అందించటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువుగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ప్రత్తి మధన్, ఉంగుటూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పంది రాంబాబు, వంగ రఘు, వెజ్జు రాంబాబు, సూరత్తుల అయ్యప్ప, నిమ్మకాయల గణ, తాటిమళ్ళ రామ్మూర్తి, భీమన దుర్గ పల్లవి, మద్దాల ఉమ, తాడిశెట్టి శివ ప్రసాద్, పంతం నరసింహమూర్తి, రాపాక సురేష్, నీలం అజయ్, అంకొలు మోహన్, జగదీష్, మురళి, ప్రత్తి మురళి, సుబ్బారావు, రాజేశ్ మరియు గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.