కార్వేటి నగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండల కేంద్రంలో జనసేనపార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ సంకల్పం కలిగిన నాయకులను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో మంచి జనసైనికులను, గొప్ప నాయకులుగా తీర్చి దిద్దుతామని తెలియజేశారు. నేటి జనసైనికులే రేపటి నాయకులని, ప్రజలకు సేవలందించడమే ద్యేయమని తెలిపారు. వచ్చే ఆదివారం జనం కోసం జనసేన కార్యక్రమం మొదలవుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవడం, వారి సమస్యలను తెలుసుకోవడం, గ్రామ సమస్యలను గుర్తించడం, దీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలు సహితం తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా, సంబంధిత అధికారులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించడం, అవసరమైతే పోరాటాలు చేయడానికి కూడా సిద్దమని తెలిపారు. వ్యక్తిత్వ వికాస సంపన్నులు, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జనరంజక పాలన అందించడం తద్యమని తెలిపారు. ఈ విధంగా నియోజకవర్గమంతా పర్యటన ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, SR పురం మండల అధ్యక్షులు చిరంజీవి, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, నగర కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, SR పురం మండల ఉపాధ్యక్షులు చార్లెస్ ప్రధాన కార్యదర్శులు నరేష్, వెంకటేష్, హరీష్, బాలరాజు, కార్యదర్సులు మని, సూర్య, పెనుమూరు ఉపాధ్యక్షులు గిరిదర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి బాలాజీ, కార్యదర్శులు నాగేంద్ర, రాజు జనసైనికులు పాల్గొన్నారు.