Logo
Date of Publish : 18 March 2022, 4:25 pm
Editor : Sake Naresh

ప్రశ్నించేవారిని అణగదొక్కాలని చూస్తే గుణపాఠం చెప్తాం : జనసేన పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్

    నాగర్‌కర్నూల్, (జనస్వరం) : ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా అణగదొక్కాలని చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని జనసేన పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్ హెచ్చరించారు. గత ఐదు రోజుల క్రితం బిజెపి కార్యకర్త ఇంటిపై టిఆర్ఎస్ గూండాలు దాడి చేసిన అంశంలో శుక్రవారం బీజేపీ కార్యకర్త భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించారు. దేశ రక్షణలో కృషిచేసిన బిజెపి కార్యకర్త తండ్రిని విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డ్ టీచర్ అయినా తల్లిని కూడా టిఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసే భూకబ్జాలు, ఇసుక మాఫియా, నల్ల మట్టి దందా, అవినీతి అక్రమాలు వాటిపై ప్రశ్నిస్తే, ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతారా అంటూ మండిపడ్డారు. ప్రజాసమస్యలపై అనునిత్యం పోరాడుతూ విధి నిర్వహణలో వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై కూడా దాడికి దిగడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.రఘు, జానీ, రాకెష్ రెడ్డి, రేచర్ల శేఖర్, బారిగారి రాజేందర్, సూర్య, జెర్రిపాటి చంద్రశేఖర్, సంతోష్, గౌరవ్, బొట్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com