Logo
Date of Publish : 16 February 2024, 9:14 pm
Editor : Sake Naresh

సర్వేపల్లి అభివృద్ధికి రాబోయే ప్రజా ప్రభుత్వంలో టీడీపీతో కలిసి జనసేన పార్టీ కృషి

   సర్వేపల్లి ( జనస్వరం ) : తోటపల్లిగూడురు మండలంలోని తోటపల్లి బిట్టు - 2 నందు శుక్రవారం పర్యటించి స్థానిక సమస్యలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ నందు మోటార్ చెడిపోయి ఉందన్నారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పంచాయతీ అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఈ స్థితిలో కూడా రాక్షస ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలను ఇంకెవరు పట్టించుకుంటారు. ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, ఇటువంటి మంత్రి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా అని అన్నారు. ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు వీళ్ళకి పట్టవా. తాగడానికి నీళ్లు కూడా అందించాలని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజల గురించి ప్రజల అవస్థల గురించి ఇంకేం పట్టించుకుంటారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలో కూడా ఎక్కడా కూడా పంచాయతీలలో కాలువలలో బ్లీచింగ్ కొట్టించిన పరిస్థితి లేదు. పంచాయతీలలో నిధులు ఉన్నాయా లేవా తోటపల్లి బిట్ వన్ నందు వారం లోపల వాళ్లకి మినరల్ వాటర్ మోటార్ను రిపేరు చేసి వెంటనే తాగునీరు అందించాలి అలా ఇవ్వని పక్షంలో మేమే ఆ మోటర్ నీ రిపేర్ మా సొంత నిధులతో చేయించి వాళ్లకి తాగునీరు అందిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకు అండగా నిలబడి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని, మండల అధ్యక్షుడు సందీప్, కోర్ కమిటీ కార్యదర్శి కల్తి రెడ్డి శ్రీనివాసులు, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, స్థానిక నాయకులు బద్వేల్ చందు, రాయప్ప, వన్ బద్వేల్ చరణ్, రవి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com