Logo
Date of Publish : 20 April 2022, 12:44 pm
Editor : Sake Naresh

విక్కుర్తి అంజినేయుల కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటాం : జనసేన నాయకులు బోనబోయిన, గాదె

    గుంటూరు, (జనస్వరం) : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యనికి బలైనా విక్కుర్తి ఆంజనేయులు కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యాక్షులు అడపా మాణిక్యాలరావు పరామర్శించారు. ఆంజనేయుల చిత్రాపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కలెక్టర్, రెవిన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తన ప్రాణాలు పోగొట్టుకున్నాడని శ్రీనివాస్ అన్నారు. అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు న్యాయం చెయ్యాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ చివరకు ప్రాణాలు తీసే స్థాయికి దిగజరిపోయారని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఇది ఆత్మహత్య కాదని పూర్తిగా ప్రభుత్వ అధికారుల హత్యేనని అన్నారు. విక్కుర్తి ఆంజనేయులు కుటుంబానికి త్వరగా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుందని హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, యర్రంశెట్టి వేణు, యర్రంశెట్టి సూర్యనారాయణ, శిఖా బాలు, యుగందర్, గంగరాజు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com