
శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, ఉప్పినవలస గ్రామంలో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఎంపీటీసీ విక్రమ్ జనసేన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలు నిల్చోడానికి కూడా స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకొండ నుంచి శ్రీకాకుళంకి బస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఎంపీటీసీ అంపిలి.విక్రమ్ మరియు జనసేన నాయకులు మల్లేష్ గారు విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ సమస్య ప్రతి నెల జరుగుతుంది ఒక రెండు రోజులు ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ యధావిధిగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి దీనిపై డిపో అధికారులు దృష్టి పెట్టు అదనంగా బస్ వేసి విద్యార్థులకు న్యాయం చెయ్యాలని విద్యార్థులు తరుపు మేము కోరుకుంటున్నామని అన్నారు.